నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఇనాయత్ నగర్లో పోడు భూముల వివాదం రాజుకుంది. గ్రామంలోని 111 సర్వే నంబర్లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు రాగా.. గ్రామస్థులు అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సహకారంతో అటవీ భూముల్లో రైతులు నాటిన మొక్కజొన్న, సోయా పంటలను ట్రాక్టర్లతో దున్నేసి మొక్కలు నాటారు. సర్వే నెం.111లోని 45ఎకరాల్లో దశాబ్దాలుగా గిరిజనులు వివిధ ఆరుతడి పంటలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటుతున్నామని అటవీ అధికారులు వెల్లడించారు.
ఇవీచూడండి: 'పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి'