నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద సఫాయి కార్మికులు ఆందోళనకు దిగారు. 2026 జీవోను ఉపసంహరించుకుని కార్మికులపై పని ఒత్తిడి భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో.. మల్టీ పర్పస్ విధానంతో తెరాస ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం .. కార్మికులను బానిసలుగా మార్చడమేనని అన్నారు.
తెరాస పాలనలో కార్మికుల బతుకులు అధ్వాన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులందరికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు గంగాధర్, భానుచందర్, రాజన్న, సోపరి గంగాధర్, ఐఎఫ్టీయూ నాయకులు భూమన్న, మురళి, శివాజీ, శివ, రవి పాల్గొన్నారు.
- ఇవీ చూడండి : 'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి'