ETV Bharat / state

సంక్రాంతి స్పెషల్ స్వీట్స్​ - వాహ్వా అనిపిస్తున్న 'ఘేవర్‌' మిఠాయి గురించి తెలుసా?

Sankranti Pindi Vantalu in Nizamabad : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పిండి వంటలు, స్వీట్లే అందరికీ గుర్తొస్తాయి. చిన్నా పెద్దా అంతా పిండి వంటల తయారీలో పాలు పంచుకుంటారు. హడావుడి జీవన ప్రయాణంలో వంటల తయారికి తీరిక లభించడం లేదు. దీంతో బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది.

Sankranti Pindi Vantalu in Nizamabad
Sankranti Pindi Vantalu
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 15, 2024, 8:23 AM IST

సంక్రాంతి అప్పాలకు భలే గిరాకీ- రద్దీగా మారిన తయారీ కేంద్రాలు

Sankranti Pindi Vantalu in Nizamabad : సంక్రాంతి పండగ వచ్చిందంటే పాత కాలంలో చిన్నా పెద్ద అందరు కలిసి పిండి వంటలు తయారు చేసుకునే వారు. కానీ ప్రస్తుత సమాజంలో పండగ జరుపుకోవడానికే సమయం లేదు. దీంతో చాలా మంది రెడిమేడ్ పిండి వంటకాలపై ఆధారపడుతున్నారు. సంక్రాంతి పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. పండగ సందర్భంగా ఎక్కువగా మురుకులు, అరిసెలు, చెకోడీలు, గరిజెలు, సకినాలకు డిమాండ్ ఉందని నిర్వాహకులు తెలుపుతున్నారు.

పండగా అనగానే పిండి వంటకాలే గుర్తుకు వస్తాయి కానీ నిజామాబాద్ జిల్లాలో వీటితో పాటు ప్రత్యేకమైన తీపి వంటకం లభిస్తుంది. రాజస్థాన్‌ వాసులకు ప్రత్యకమైన ఘేవర్‌ అనే తీపి వంటకానికి సంక్రాంతి వేళ నిజామాబాద్‌లో మంచి డిమాండ్‌ ఉంది. సంక్రాంతి సమయంలో రాజస్థాన్‌లో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అందుకే అక్కడి వారు ప్రత్యేకంగా ఈ సీజన్​లో ఘేవర్​ను తయారు చేసి ఇక్కడికి పంపేవారు. క్రమంగా నిజామాబాద్​లోనే అది లభించడంతో స్థానికుల ఆదరణను పొందింది. కేవలం సంక్రాంతికు వారం ముందు నుంచి తయారీ ప్రారంభించి సంక్రాంతి తర్వాత ఆపేస్తారు.

పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు - బోగి మంటల మధ్య విద్యార్థుల నృత్యాలు

'జాబ్​లు చేస్తా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి సంక్రాంతి పండుగకు పిండి వంటలు వండుకోవడానికి కుదరదు. మీరు పిండి వంటలు బాగా చేస్తున్నారు. మీరు మంచిగా రుచికరంగా చేయబట్టే అన్ని రకాల పిండి వంటలను తినగలుగుతున్నామని అంటున్నారు. ఇప్పుడు నూవుల లడ్డులు చాలా తీసుకెళ్తున్నారు. సంక్రాంతి అంటే పిండి వంటల్లో స్పెషల్ అదే కాదా నూవుల లడ్డులు, నూవుల బూరెలు ఇలా అన్ని రకాల పిండి వంటలు సంక్రాంతి బాగా సేల్ అవుతున్నాయి.' -వ్యాపారులు

సంక్రాంతి విశిష్టత ఏమిటి - దీనిని పెద్ద పండుగ అని ఎందుకు అంటారు?

Special Story on Sankranti Pindi Vantalu : ఘేవర్​ను మూడు రకాలుగా తయారు చేస్తుంటారు. సాధారణ ఘేవర్, మలై ఘేవర్, షుగర్ లెస్ ఘేవర్ రూపాల్లో లభిస్తుంది. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ మార్వాడీలు సంక్రాంతి సమయంలో ఘేవర్ స్వీట్ ఇచ్చి శుభాకాంక్షలు చెబుతారు. తమ బంధు మిత్రులు ఎక్కడ ఉన్నా వారికి ఈ స్వీట్ పంపి శుభాకాంక్షలు చెప్పడం వారి సంప్రదాయం. క్రమంగా స్థానికులు సైతం ఈ స్వీట్​ను ఇష్టంగా తినడం ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం అన్ని స్వీట్ షాపులలోనూ ఈ స్వీట్‌ లభిస్తోంది. పండగ సందర్భంగా స్వీట్స్, పిండి వంటకాలకు గిరాకీ బాగా పెరిగిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో తాయారు చేసే సమయం లేక ఎక్కువ మంది షాపులలోనే తీసుకెళ్లడంతో తమ వ్యాపారం పెరుగిందని వ్యాపారులు అంటున్నారు.

'సంక్రాంతి పండుగకు మాకు ఎక్కవ గిరాకీ ఉంటుంది. గతవారం నుంచి మాకు గిరాకీగానే ఉంది. రెండు నెలల నుంచి మేము చాలా బీజీగా ఉంటున్నాం. పెళ్లిళ్ల ఆడర్లు చాలా వస్తున్నాయి. మేము పిండి వంటకాలను కొరియర్ ద్వారా అన్ని ప్రాంతాలకు పంపిస్తాం.' -వ్యాపారులు

తెలంగాణలో సంక్రాంతి సంబురం - ఆకట్టుకుంటున్న రంగవళ్లులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.