ETV Bharat / state

నిజామాబాద్​ జిల్లాలో రోడ్డెక్కిన ప్రజా రవాణా

author img

By

Published : May 19, 2020, 11:51 AM IST

నిజామాబాద్​ జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు అధికారులు... డిపోలోనే బస్సులను శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. మాస్కు ధరించని ప్రయాణికులను బస్సులోకి అనుమతించడం లేదు.

Nizamabad District latest
Nizamabad District latest

ఇందూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉమ్మడి నిజామాబాద్ రీజినల్ పరిధిలో 6 డిపోలు ఉండగా,అందులో 650 బస్సులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిపో- 1 నుంచి 32, డిపో- 2, 28 బస్సులను వివిధ రూట్లలోకి పంపించినట్లు ఆర్ఎం సోలమన్ తెలిపారు​. ప్రయాణికుల సంఖ్యను బట్టి మరికొన్ని బస్సులను పెంచే అవకాశం ఉందన్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులకు శానిటైజర్లను పంపిణీ చేసినట్లు సోలమన్​ తెలిపారు. బస్సులో ప్రయాణికులను పరిమిత సంఖ్యలో ఎక్కించాలని ఉద్యోగులకు సూచించారు. నిలబడి ప్రయాణిచేందకు అనుమతులు లేవని పేర్కొన్నారు. జిల్లా నుండి అన్ని జిల్లాలకు బస్సులను పంపడం జరుగుతుందని... రెడ్​జోన్ ప్రాంతాలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు బస్సులను నడపం లేదని తెలిపారు. కర్ఫ్యూ అమలులో ఉన్నందున బస్సులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నడపడం జరుగుతుందని... ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుంచాలని ఆర్​ఎం సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.