నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సాంపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్రు డీసీఎం వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం... కాళేశ్వరం ప్యాకేజ్‌లో భాగంగా భారీ పైపులను తీసుకువెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డీసీఎం నుజ్జునుజ్జయింది.
డీసీఎం డ్రైవర్ షేక్ కరీం, క్లీనర్ ముజాహిద్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం... 9 మందికి గాయాలు