ETV Bharat / state

ETV BHARAT EFFECT: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న 'దీపక్​'కు దాతల బాసట - telangana news 2021

ఈటీవీ-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన లభించింది. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న పదహారేళ్ల బాలుడు దీపక్​కు అండగా నిలిచేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. ఒకరు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించగా.. మరొకరు దీపక్​ జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ETV BHARAT EFFECT
ETV BHARAT EFFECT
author img

By

Published : Aug 9, 2021, 4:19 PM IST

అరుదైన వ్యాధితో బాధపడుతోన్న నిజామాబాద్​ జిల్లా బోధన్​కు చెందిన పదహారేళ్ల బాలుడు దీపక్​పై ఈటీవీ-ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనానికి స్పందన లభించింది. 'మాత్ర ఉంటేనే మూత్రం ఆగేది.. దాతలు ఆదుకుంటేనే ఆ మాత్ర దొరికేది!' పేరిట ప్రచురితమైన కథనానికి నిజామాబాద్​కు చెందిన ఓ ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్​ సుజాత మానవత్వంతో స్పందించారు. దీపక్​కు సాయం చేస్తానంటూ ముందుకొచ్చారు.

బాలుడికి అండగా నిలిచిన డాక్టర్ సుజాత
బాలుడికి అండగా నిలిచిన డాక్టర్ సుజాత

దీపక్​కు అవసరమయ్యే మాత్రలను ప్రతి నెలా అందిస్తామని డాక్టర్​ సుజాత పేర్కొన్నారు. దీంతోపాటు పౌష్టికాహారం కోసం కొంత డబ్బులు ఇస్తామని తెలిపారు. దీపక్​ జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిజామాబాద్​ పట్టణానికి చెందిన మరో దాత రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

వెంటాడిన అనారోగ్యం..

దీపక్​ను చిన్నప్పటి నుంచే అనారోగ్యం వెంటాడుతోంది. చివరకు జీవితకాలం వెంటాడే వ్యాధిగా తేలింది. ఐదేళ్ల ప్రాయంలోనే దీపక్​కు డెంగీ సోకితే హైదరాబాద్​కు తీసుకెళ్లి నయం చేయించుకొచ్చారు. అప్పుడే చాలా డబ్బులు ఖర్చు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో... ముక్కులో నుంచి రక్తం కారడం మొదలైంది. ఏమిటా అని ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎన్నో పరీక్షలు చేయించారు. పరీక్షలకు డబ్బులు లేక సతమతమవుతుంటే... స్థానిక కౌన్సిలర్ పద్మ కుటుంబం ద్వారా ఎమ్మెల్యే షకీల్​ను సంప్రదించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత ఆర్థిక సాయంతో హైదరాబాద్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకున్నారు. మూడేళ్ల కిందట ఉపాధ్యాయురాలు సుధ కొన్ని పరీక్షలు చేయించారు.

అరుదైన వ్యాధిగా వెల్లడి..

చివరకు బాలుడికి సెంట్రల్ డయాబెటిక్ ఇన్సిపిడస్ (సీడీఐ) అనే అరుదైన వ్యాధి ఉందని గుర్తించారు. ఈ వ్యాధిలో మూత్రపిండాలను నియంత్రించే హార్మోన్​ను విడుదల చేసే పిట్యూటరీ గ్రంథి దెబ్బతినడంతో సేవించిన నీరు శరీరానికి ఇంకకుండా నేరుగా మూత్రపిండాల ద్వారా బయటకు వెళుతుంది. తరచూ దాహం కావడం, తిన్నది కూడా ఒంటికి పట్టకపోవడం జరుగుతుంది. మూత్రపిండాలను పని చేయించాలంటే కృత్రిమంగా హార్మోను మాత్రలు వాడాలని వైద్యులు సిఫారసు చేశారు. ఈ లోపాలతో బాలుడిలో ఎదుగుదల నిలిచిపోయింది. ఇంకా చిన్న పిల్లాడి రూపమే కనిపిస్తోంది.

మాత్ర వేయకుంటే తరచూ మూత్రం..

రోజుకు రెండు పూటలు మాత్రలు వేయాల్సిందే. లేదంటే తరచూ మూత్రానికి పోవాల్సి వస్తుంది. కేవలం ఒక రోజు రాత్రిలోనే ఐదు లీటర్ల మూత్రం ఉత్పత్తి అయినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ మాత్ర వేసుకోకుంటే రాత్రి పూట ఎక్కువసార్లు నిద్ర లేవాల్సిన పరిస్థితి. తరచూ దాహం, మూత్రంతో శరీరం బలహీనపడడం, రాత్రి మూత్రంతో సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతూ... దీపక్​ నరకయాతన అనుభవిస్తున్నాడు.

సంబంధిత కథనం..

మాత్ర ఉంటేనే మూత్రం ఆగేది... దాతలు ఆదుకుంటేనే ఆ మాత్ర దొరికేది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.