నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జ్వరం రావడం వల్ల అతనిని ఆస్పత్రికి తీకుకెళ్లారు. అక్కడ టాయిలెట్స్ రూంలోకి వెళ్లి డోర్‌కు ఉరేసుకుని చనిపోయాడు. ఉరివేసుకున్న రిమాండ్ ఖైదీని బాలాజీ పవార్(24)గా గుర్తించారు. మృతుడి స్వస్థలం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్.
అతనికి కరోనా టెస్టు నిర్వహిస్తే నెగటివ్ వచ్చినట్లు సమాచారం. అసలు అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఆర్థిక కారణాలే కారణామా? కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నాయా ఇలా అనేక విధాలుగా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి : ఉస్మానియాపై కథనాలను సుమోటోగా స్వీకరించిన ఎస్హెచ్ఆర్సీ