ఇవీ చూడండి:భారత్ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'
'అధికారంలోకి రాగానే పసుపు పంటకు మద్దతుధర' - modi
కేంద్రంలో భాజపా అధికారంలోకి రాగానే పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇస్తాం.. పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం... అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం చక్కెర కర్మాగారం తెరిపిస్తాం: రాజ్ నాథ్ సింగ్
నిజమాబాద్ సభలో రాజ్‌నాథ్ సింగ్
అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టారు. ఇప్పుడు మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాను గెలిపించండని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇందూరు ఓటర్లను కోరారు. నిజమాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో భాజపా వస్తే 2022 నాటికల్లా పేదరికాన్ని పారద్రోలతామని హామీ ఇచ్చారు. పసుపు, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర రావట్లేదని... భాజపా అధికారంలోకి వస్తే మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్ని జరగాలంటే భాజపా అభ్యర్థి అర్వింద్‌ను గెలిపించాలని ఓటర్లకు సూచించారు.
ఇవీ చూడండి:భారత్ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'
Last Updated : Apr 2, 2019, 4:24 PM IST