నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి కొన్ని కాలనీలు నీట మునిగాయి. సరస్వతి నగర్ వెంకటేశ్వర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎక్కడిక్కడ నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నవీపేట్ తహశీల్దార్ కార్యాలయం, ఉన్నత పాఠశాల ఆవరణ చెరువును తలపించింది. జక్రాన్ పల్లి, నవీపేట్, మోర్తాడ్, వేల్పూర్, డిచ్ పల్లి, మెండోరా, బాల్కొండ, నందిపేట్, ధర్పల్లి, రుద్రూర్, మండలాల్లో లోతట్టు ప్రాంతాలలోకి నీళ్లు వచ్చి చేరాయి. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్ మండలాల్లో వర్షం కురిసింది.
ఇవీ చూడండి: కర్ణాటకీయం మళ్లీ వాయిదా.. 22న విశ్వాస పరీక్ష..!