వ్యాక్సినేషన్ రెండో డోసు కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రెండో డోసు కోసం వివిధ కేంద్రాల్లో రెండో రోజూ క్యూలైన్లు కనిపించాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవాగ్జిన్ ఇస్తుండటంతో వ్యాక్సిన్ కోసం ప్రజలు లైన్లలో నిల్చున్నారు. మిగతా కేంద్రాల్లో కొవీషీల్డ్ ఇస్తుండగా.. అక్కడ సాధారణంగానే ఉంది.
మహిళలు, వృద్ధులు ఉదయాన్నే కేంద్రాలకు తరలి వచ్చారు. పది గంటలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా 200 మందికి ఒక్కో కేంద్రంలో టోకెన్లు ఇచ్చి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మిగతా వారు తిరిగి వెళ్లిపోతున్నారు. నిన్న 2వేల డోసు కొవాగ్జిన్ జిల్లాకు చేరుకుంది. ఈ వ్యాక్సిన్ రెండో డోసు కోసం జిల్లాలో ఎదురుచూస్తున్న అందరికీ అందనుంది.