ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని కొనియాడారు నిజామాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్ దదన్నగారి విఠల్ రావు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యాక్రమంలో పలువురు పాల్గొన్నారు.