ETV Bharat / state

పీఎఫ్​ డబ్బును సొంతానికి వాడుకున్న ఏజెన్సీ - తెలంగాణ విశ్వవిద్యాలయం తాజా వార్తలు

చిన్న ఉద్యోగాలతో జీవనం సాగించేవారు కరోనా కాలంలో ఖర్చులు పెరిగి సతమతమవుతుంటే.. ఇలా కష్టాలు పడే వారినే లక్ష్యంగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్​ తెలంగాణ విశ్వవిద్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగులు పీఎఫ్ డబ్బును గడిచిన 8 నెలలుగా వారి ఖాతాల్లో జమ చేయకుండా ప్రైవేటు ఏజెన్సీ యాజమాన్యం సొంతానికి వాడేసుకుంది. వారిని నిలదీయగా డిసెంబర్ 25వ తేదీ కల్లా జమ చేస్తానని బాండ్ పేపరు రాసిచ్చింది.

privet agency miss used outsourcing employees pf money in nizamabad district
పీఎఫ్​ డబ్బును సొంతానికి వాడుకున్న ఏజెన్సీ
author img

By

Published : Dec 20, 2020, 3:56 PM IST

నిజామాబాద్​లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగుల పీఎఫ్​ డబ్బును ప్రైవేటు ఏజెన్సీ వాడుకోవటంతో సిబ్బంది ఆందోళనకు దిగారు. 8 నెలలుగా పీఎఫ్​ సొమ్మును జమ చేయకుండా ఏజెన్సీ సొంతానికి వాడుకుంది. అనుమానం వచ్చిన ఉద్యోగులు ఖాతాలో డబ్బులు చూసుకోగా అసలు విషయం బయటపడింది.

ఉద్యోగులు ఇటీవల ధర్నా చేయటంతో ఏజెన్సీ యాజమాన్యాన్ని రిజిస్ట్రార్ పిలిపించి మాట్లాడగా ఈనెల 25 వరకు చెల్లిస్తామని బాండ్ పేపరు రాసిచ్చారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: పులిగుండాల ప్రాజెక్టులో ముగ్గురు యువకుల గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.