నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ జైల్లో వెంకట్ అనే ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. గతవారం జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. మనస్థాపం చెందిన వెంకట్ బాత్రూంలో ఉరివేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అరగొండకు చెందిన వడ్ల వెంకట్ ఏడాదిన్నర క్రితం తన కుమారుడి కొడుకుని చంపాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. కేసు సమగ్ర విచారణ చేసి జీవితఖైదు విధించింది. తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: భూపతిరెడ్డిపై వేటు రాజ్యాంగబద్ధమే: హైకోర్టు