నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, దర్పల్లి సిరికొండ మండలాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. భారీగా కురిసిన వర్షానికి పంటలు నేలకొరిగాయి.
కోత పూర్తి చేసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. మూడేళ్ల తర్వాత సమృద్ధి వర్షాలతో ఆనందపడ్డ అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. పంట కోతల సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్షకులు కన్నీరుమున్నీరవుతున్నారు.