నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో... స్వచ్ఛ సంరక్షణ గ్రామీన్ కార్యక్రమంలో భాగంగా "స్వచ్చ హి సేవ" కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు. అనంతరం గ్రామంలోని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికల కార్యక్రమం ముగియదని ఇది కేవలం ఆరంభం మాత్రమేనని కలెక్టర్ తెలిపారు. నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రజలకు సూచించారు. గ్రామ ప్రవేశాలలో చెత్తకుప్పలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతను రోజూ పాటిస్తామని గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎల్లుండి ప్రధానితో భేటీ..