నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు పీహెచ్డీ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇటీవల విడుదల చేసిన ఓబీసీ ఫెలోషిప్‌లో తెలుగు రాష్ట్రాల పరిశోధక విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని... దీని వల్ల ఓబీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఓబీసీ ఫెలోషిప్‌ను 6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా ఎస్సీ ఫెలోషిప్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీ, ఎస్సీ విద్యార్థులకు సెట్, నెట్ వంటి షరతులు లేకుండా ఫెలోషిప్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: తెలంగాణ బడ్జెట్... రూ.1,46,492.3 కోట్లు