నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వాహనాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తుండగా బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను నీలా పేపర్ మిల్ గ్రామస్థులు నిలువరించారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడం లేదని ఆయనను నిలదీశారు.
గ్రామస్థులపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఊహించని సంఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో గ్రామస్థులు, తెరాస నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన వాహనాన్ని అడ్డగించిన గ్రామస్థులపై ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై నిలదీస్తే ఎమ్మెల్యే అలా వ్యవహరించడంపై గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు.
ఇదీ చూడండి: Rain Effect: వర్షాలతో నిజామాబాద్ జిల్లా అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్తం