ETV Bharat / state

ఉమ్మడి నిజామాబాద్​లో కిటకిటలాడిన మద్యం షాపులు

author img

By

Published : May 6, 2020, 7:51 PM IST

తెలంగాణలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చిన తరుణంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మద్యం దుకాణాల వద్ద సందడి నెలకొంది. మందుబాబులు ఉదయం నుంచే వైన్​ షాపుల ఎదుట క్యూ కట్టారు. షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా పోలీసులు, యజమానులు జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్కులు ధరించిన వారికే మద్యం విక్రయిస్తున్నారు.

నిజామాబాద్​ మద్యం షాపులు
నిజామాబాద్​ మద్యం షాపులు

మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడం​ వల్ల నెలన్నరగా మూతపడిన మద్యం దుకాణాలు బుధవారం తెరుచుకున్నాయి. ఉదయం నుంచే మద్యపాన ప్రియులు వైన్​ షాపుల వద్ద బారులు తీరారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా వైన్స్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నో మాస్క్​... నో లిక్కర్ అంటూ ఎక్సైజ్ అధికారులు సూచించడం వల్ల... మాస్కులు ధరించిన వారికే యజమానులు మద్యం అమ్ముతున్నారు.

కామారెడ్డిలో...

కామారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోని మద్యం విక్రయ కేంద్రాల వద్ద జనసందడి నెలకొంది. మద్యం దొరక్క విలవిల్లాడిన జనాలు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకపోతే మద్యం షాపుల లైసెన్స్​లు రద్దు చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలతో యజమానులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మద్యం దొరుకుతుందో లేదో అని ఉదయం 8 గంటల నుంచే మందుబాబులు వరుసలో నిల్చున్నారు.

బాన్సువాడలో...

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో మద్యం కొనేందుకు మద్యం ప్రియులు ఎగబడ్డారు. పోలీసుల బందోబస్తు నడుమ మద్యం దుకాణాల నిర్వాహకులు విక్రయాలు జరిపారు. భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. మాస్క్ ధరించి వచ్చిన వారికే మద్యం అమ్మారు. మాస్క్​లు ధరించకుండా షాపు వద్దకు వచ్చిన వారికి పోలీసులు జరిమానా విధించారు. పలు మద్యం దుకాణాల వద్ద జనాలు ఎగబడడం వల్ల పోలీసులు వారిని చెదరగొట్టారు.

బాల్కొండలో...

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో మద్యప్రాన ప్రియులు ఉదయం నుంచే దుకాణాల ముందు క్యూ కట్టారు. కొంత మంది చెప్పులు వరుసలో పెట్టారు. మద్యం కోసం వచ్చిన వారి చేతులను శానిటైజర్‌ ద్వారా కడిగిన తర్వాతే మద్యం అందించారు. భౌతిక దూరం పాటించేలా యజమానులు చర్యలు చేపట్టారు. మద్యం ధరలు పెంచడం వల్ల.. అయ్యో ధరలు పెంచారా అని కొందరు నిట్టూర్చారు. మద్యం లభించిన వారు సంతోషంగా కౌంటర్‌ వద్ద నుంచి వెళ్లారు.

నిజామాబాద్​ గ్రామీణం...

నిజామాబాద్​ గ్రామీణ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మద్యం దుకాణాల వద్ద ఉదయం నుంచే ప్రజలు వరుసలో నిల్చున్నారు. చాలా చోట్ల వరుసలో చెప్పులు, చేతి రుమాలు పెట్టి నీడన సేద తీరారు. మద్యం ప్రియులు సమూహాలుగా గుమిగూడకుండా... ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లతో చేతులు కడుక్కున్నాకే మద్యం అమ్మారు.

బోధన్​లో...

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో వైన్స్​లు తెరవకముందే ప్రజలు క్యూ కట్టారు. వైన్స్​ల వద్ద ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వరుసలో నిలబడ్డారు. ఇంకొంతమంది ప్రభుత్వం వేసిన రూ.1500ల కోసం బ్యాంకులు, బ్యాంక్ సర్వీస్ సెంటర్ల వద్ద బారులు తీరారు.

ఉమ్మడి నిజామాబాద్​లో కిటకిటలాడిన మద్యం షాపులు

ఇదీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.