తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 9 నుంచి 13 వరకు పీజీ పరీక్షలు నిర్వహించనున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. పరీక్ష కేంద్రాలను అన్ని యూనివర్సిటీలలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
యూనివర్సిటీ పరీక్ష కేంద్రాలకు.. గ్రామీణ విద్యార్థులకు సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది, పరీక్షల మధ్య ఒక్క రోజు కూడా వ్యవధి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక భారం, బస్సుల్లో ప్రయాణించడం వల్ల కరోన సోకే అవకాశం ఉన్నందున యూనివర్సిటీ హాస్టల్స్ తెరవాలని పీడీఎస్యు కోరింది. పరీక్షల మధ్య ఒక రోజు వ్యవధి ఇవ్వాలని, కచ్చితంగా యూనివర్సిటీ కేంద్రాలతో పాటు అన్ని జిల్లాల్లో పీజీ, డిగ్రీ ప్రైవేట్ కళాశాలల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: ఆ చట్టాలను రద్దు చేయాలి: ఏఐకేఎస్‌సీసీ