పట్టణ ప్రగతి కార్యక్రమం లక్ష్యం సాధించడంలో ప్రజలు అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. ఆర్మూర్ మున్సిపాలిటీల్లో అమలవుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.
ప్రతి గ్రామంలో పల్లె ప్రగతిలో పారిశుద్ధ్య పనులు ఎలా జరిగాయయో అదేవిధంగా పట్టణ ప్రగతిలో కూడా జరుగుతాయని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పండిత్ వినీత, మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మున్ను భాయ్, తదితరులు పాల్గొన్నారు.