ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలకు నామపత్రాలను దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 144 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంఘ కార్యాలయం వద్దకు రైతులు పెద్దసంఖ్యలో చేరుకుని నామినేషన్లు సమర్పించారు.
ఇందల్వాయి మండలం నల్లవెల్లి సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున నామ పత్రాలు దాఖలు చేశారు. శుక్ర, శనివారాల్లో మరిన్ని నామపత్రాలు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.