నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలోని 32వ వార్డులో టెండర్ ఓటు కారణంగా 87వ పోలింగ్ బూత్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు రీ-పోలింగ్ ప్రారంభించారు. 32వ వార్డు 87వ పోలింగ్ బూత్‌లోని మొత్తం 588 ఓటర్లు మళ్లీ ఓటు వేస్తున్నారు.
బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇదే వార్డుకు చెందిన నసెహ సుల్తానా టెండర్ ఓటు విషయం కోర్టుకు వెళ్లడం వల్ల అధికారులు ఈరోజు రీ-పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీచూడండి: ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు..