సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే వానాకాలన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మురుగు నీరు నిల్వ ఉండకుండా జూన్1 నుంచి 8 వరకు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ ద్వారా చెత్త, మురికిని తొలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. తాగు నీరు సరఫరా కేంద్రం నుంచి ఇంటింటికి ఇచ్చే నల్ల పైప్ వరకు ఎటువంటి లికేజీలు లేకుండా నీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. వర్షపు నీరు నిల్వకుండా నీటిని తరలించే ఏర్పాట్లు చేయాలని.. ఖాళీ ప్రదేశాల్లో చెత్త, మురుగు, నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు