నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో అధికార పార్టీ అభ్యర్థుల ఓటమి కారణమైన పసుపు బోర్డు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్గటూర్ నుంచి పసుపు రైతులు పాదయాత్ర ప్రారంభించారు.
పసుపు బోర్డు ఏర్పాటు, కనీస మద్దతు ధర, శాసనసభలో బోర్డు ఏర్పాటుపై తీర్మానం, మార్కెట్ ధర, మార్కెట్ స్థిరీకరణ నిధి ఈ ఐదు ప్రధాన డిమాండ్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని కర్షకులు స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వారంలోగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. హామీ నెరవర్చకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు అర్వింద్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
- ఇవీ చూడండి:దరాబాద్ విశ్వవిద్యాలయాల్లో "పౌర" సెగలు