కరోనా దృష్ట్యా విద్యాసంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ నాయకులు కేసీఆర్కు లేఖ రాశారు. విద్యారంగ బలోపేతానికి ప్రధానంగా తొమ్మిది డిమాండ్లను ప్రస్తావించినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విగ్నేశ్ తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించనున్న తరుణంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులను ఉచితంగా అందించాలని లేఖలో పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో వైద్యశాలలు, మెడికల్ దుకాణాలు, అంబులెన్సులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లాకు ఐదు కోట్ల విద్యా సంక్షేమ నిధిని అదనంగా అందించాలని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో వేణు, మహేష్, మారుతి, నాయకులు పాల్గొన్నారు.