రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ ఏడాది సైతం ఏప్రిల్ నెల నుంచే ఎండలు క్రమంగా పెరుగుతుండగా.. లాక్డౌన్ కారణంగా ప్రజలు బయటకు రాకపోవడం వల్ల ప్రభావం తెలియలేదు. ఇప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తుండటం వల్ల భగభగ మండుతున్న ఎండలతో జనం బేజారెత్తిపోతున్నారు.
మే ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మే చివరి వరకు మరింతగా ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ అధిక ఉష్ణోగ్రతలతో లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవీ చూడండి: ప్రతి ఉత్పత్తిపై ఓరియంటల్ ఇన్సూరెన్స్: నిరంజన్ రెడ్డి