ETV Bharat / state

చేతులెత్తేస్తోన్న మందుల దుకాణ యజమానులు

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది పరిస్థితి. కొవిడ్‌-19 (కరోనా) విషయంలో నెలకొన్న భయంతో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారిగా వాటి ధర ఆకాశాన్నంటింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఎమ్మార్పీ ధరకే విక్రయించేలా ఔషధ నియంత్రణ శాఖ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని దుకాణ యజమానులు మాస్కులే లేవని చెబుతున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం, క్షేత్రస్థాయి పరిస్థితి ఉన్నతాధికారులకు చేరవేయటంలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

nizamabad people are facing problems as the masks are not available
చేతులెత్తేస్తోన్న మందుల దుకాణ యజమానులు
author img

By

Published : Mar 15, 2020, 5:20 PM IST

నిజామాబాద్​ జిల్లాలో ప్రతి విద్యార్థి మాస్కుతో రావాలని పాఠశాలల యాజమాన్యాలు చెప్పగా తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు తీయడం వల్ల వాటి ధర ఒక్కసారిగా పెంచేశారు. రూ. 6 ఉంటే రూ. 80కి విక్రయించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నాలుగు రోజులు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మందుల దుకాణాలపై దాడులు చేశారు. ఎక్కువ ధరకు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. వైద్యులు మందుల చీటీలో రాస్తేనే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో సామాన్యుడు మెడికల్‌ దుకాణాలకు వెళ్తే స్టాక్‌ లేదని చెప్పేస్తున్నారు.

యజమానులు ఏమంటున్నారంటే?

మాస్కులు తయారు చేసే వారే రూ. 20 తక్కువకు ఇవ్వడం లేదని, వాటిని కొనుగోలు చేసి తాము రూ. 10కి ఎలా విక్రయిస్తామని దుకాణాల యజమానులు వాపోతున్నారు. జిల్లా అధికారులు పరిశీలించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

దారి మళ్లింపు

ఔషధ నియంత్రణ అధికారులు వరుస దాడులు చేయడం వల్ల మాస్కులను దారిమళ్లించారు. సూపర్‌ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, పాఠశాలలకు కొందరు గుట్టుగా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. జలుబు, దగ్గు ఉన్న వారికి సైతం మాస్క్‌లు దొరికే పరిస్థితి లేదు.

శాఖల మధ్య సమన్వయంతో...

శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి చేయిదాటక ముందే ఔషధ నియంత్రణ శాఖ అధికారులే కాకుండా విద్య, తూనికలు కొలతల శాఖ, వైద్యఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ అధికారులు, జిల్లా అధికారులు ఏకకాలంలో స్పందించి మాస్క్‌లు, శానిటైజర్లు, చేతులు శుభ్రం చేసుకునే ఇతర రసాయనాల అక్రమ నిల్వలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అందుబాటులో ఉండేలా చర్యలు

"ఎక్కువ ధరకు మాస్కులు విక్రయించినట్లు సమాచారం వస్తే నాలుగు రోజులు దాడులు చేశాం. మందుల చీటీ ఉంటేనే ఇవ్వాలని చెప్పాం. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు పెడతాం. ప్రతి మందుల దుకాణంలో అందుబాటులో ఉంచాలని యజమానులకు సూచించాం. ముఖ్యంగా బస్టాండు, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లోని దుకాణాల నిర్వాహకులకు ప్రత్యేకంగా చెప్పాం. "

- రాజ్యలక్ష్మి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ

ప్రచారంపై దృష్టి సారించాం

"వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి సారించింది. మాస్కుల విషయం ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చూస్తున్నారు. వీటి కొరత ఉన్నట్లు మా దృష్టికి రాలేదు."

- సుదర్శనం, వైద్య ఆరోగ్యశాఖ అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.