ఆరోవిడత హరితహారంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని 11వ డివిజన్లో మేయర్ దండు నీతూ కిరణ్ మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రజలు తీసుకోవాలని సూచించారు. కాలనీ పరిధిలో ఖాళీ స్థలాల్లో వర్షపునీరు నిలువ ఉన్నట్లయితే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందిచాలని కోరారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నీటి నిల్వలను తమ ఇంటి ఆవరణలో ఉండకుండా చూసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.