ETV Bharat / state

MP Arvind comments: 'మంత్రి అనుచరులే విత్తనాలను బ్లాక్​లో విక్రయిస్తున్నారు' - ధర్మపురి అర్వింద్​ తాజా వ్యాఖ్యలు

MP Arvind comments: తెలంగాణలో ధాన్యం సేకరణను కేంద్రం 95 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ తెలిపారు. ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు. మూతపడిన చక్కెర పరిశ్రమలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే సంక్రాంతి తర్వాత ఉద్యమం లేవదీస్తామన్నారు.

MP Arvind comments: 'మంత్రి అనుచరులే విత్తనాలను బ్లాక్​లో విక్రయిస్తున్నారు'

author img

By

Published : Dec 30, 2021, 10:16 PM IST

MP Arvind comments: ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ధాన్యం సేకరణను 95 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని చెప్పారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పిన రాష్ట్రమే మళ్లీ.. దిల్లీలో ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నులకు అదనంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. రా రైస్ ఎంత ఇస్తే అంత తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.

చక్కెర పరిశ్రమలను వెంటనే తెరిపించాలి..

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని భాజపా ఎంపీ అర్వింద్​ ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నేత డి.శ్రీనివాస్ భాజపాలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని చెప్పారు. మూతపడిన చక్కెర పరిశ్రమలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే సంక్రాంతి తర్వాత ఉద్యమం లేవదీస్తామన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డికి వరి పంట, ధాన్యంపై అవగాహన లేదని అర్వింద్ విమర్శించారు. మంత్రి సొంత జిల్లాలో ఆయన అనుచరులే పొద్దు తిరుగుడు విత్తనాలు బ్లాక్​లో విక్రయిస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే ఓడిపోవడం ఖాయం..

జిల్లా సహకార బ్యాంకు డిపాజిట్లు, అప్పుల వివరాలను ఛైర్మన్ ప్రజల ముందు ఉంచాలని.. లేదంటే బాన్సువాడ నుంచి ఉద్యమం లేవదీస్తామని ప్రకటించారు. తన ద్వారా పార్టీలో చేరినా.. కష్టపడి పనిచేసే వాళ్లకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని.. అందుకు ఏం చేయాలో అన్నీ చేస్తామని అర్వింద్ అన్నారు.

ధాన్యం సేకరణపై రాష్ట్ర సర్కారు ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. తెలంగాణలో ధాన్యం సేకరణను 95 లక్షల మెట్రిక్​ టన్నులకు పెంచాం. రా రైస్ ఎంత ఇస్తే అంత తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర సర్కారు అనవసర రాద్దాంతం చేస్తోంది. మూతపడిన చక్కెర పరిశ్రమలను వెంటనే తెరిపించాలని డిమాండ్​ చేస్తున్నాం. లేదంటే సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తాం.

-ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

MP Arvind comments: 'మంత్రి అనుచరులే విత్తనాలను బ్లాక్​లో విక్రయిస్తున్నారు'

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.