నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ నగరంలో డివిజన్ల వారిగా పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. 7వ డివిజన్ పరిధిలో గల రోటరీ నగర్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీరునిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పరిసరాల్లో చెత్త ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.
వర్షపు నీటిని మళ్లించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని గుర్తు చేశారు. ఈ పర్యటనలో మేయర్‌తో పాటు మున్సిపల్ ఇంజినీర్ ఆనంద్ సాగర్, డీఈ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం