రాబోయే వర్షాకాలం దృష్ట్యా నిజామాబాద్ మున్సిపాలిటీలోని పలు డివిజన్లలో మేయర్ నీతూ కిరణ్ పర్యటించారు. పట్టణ కేంద్రంలోని 11వ డివిజన్లోని పెయింటర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, సీఎం రోడ్, 29వ డివిజన్లోని అమన్ నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
మురికి కాలువల పూడిక తీసి మురుగు వల్ల దోమలు పెరగకుండా జాగ్రత్త పడుదామంటున్నారు. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్నీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి : 'కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పినా వైద్యం చేయలేదు'