నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్... పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నగరంలోని 20వ డివిజన్ ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
అలాగే నగరంలోని 10, 11వ డివిజన్లలో కొనసాగుతున్న మంచి నీటి పైప్ లైన్ పనులు, వీధి దీపాల ఏర్పాట్లను మేయర్ నీతూ కిరణ్ పర్యవేక్షించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ న్యాలమ్ రాజు, తెరాస నాయకులు సుజన్, మున్సిపల్ ఇంజినీర్ వాజీద్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో