నిజామాబాద్ ఐడీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్‌గా రమేశ్ పదవీ బాధ్యతలు చేపట్టిన నుంచి అవినీతికి పాల్పడుతున్నట్లు జూనియర్ అసిస్టెంట్ నర్సయ్య ఆరోపణ చేశాడు. సంస్థలో పనిచేసే ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానంటూ ఛైర్మన్‌తో చేతులు కలిపి ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు పేర్కొన్నాడు.
బోధన్, ఆర్మూర్ పట్టణ ప్రాంతాలలో షాపింగ్ కాంప్లెక్స్ అనుమతుల కోసం లక్షల కొద్ది డబ్బులు తీసుకున్నట్లు నర్సయ్య వెల్లడించారు. అదేవిధంగా హాస్టళ్లకు నిత్యావసర సరకుల ధరలను ఎక్కువగా చూపించి బిల్లులు తీసుకున్నట్లు తెలిపారు. అధికారులు వెంటనే బిజినెస్ మేనేజర్ రమేశ్‌పై చర్యలు తీసుకొని.. అనినీతిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం