నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద జక్రాన్పల్లి, అర్గుల్, కొలిప్యాక్ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. విమానాశ్రయానికి తమ భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. విమానాశ్రయ నిర్మాణానికి తాము వ్యతిరేకం కామని.. కానీ సాగు భూముల జోలికి రావద్దని విజ్ఞప్తి చేశారు. తమ నుంచి భూములు లాక్కొని వ్యవసాయం దూరం చేయవద్దని వేడుకున్నారు. తమను అనాథలుగా మార్చవద్దని నిరసన వ్యక్తం చేశారు.
విమానాశ్రయ అధీనంలోకి మూడు గ్రామాల్లోని సుమారు పదహారు వందల ఎకరాల సాగు భూమి పోతుందని... సాగుకు అనువైన తమ భూములు వదిలేసి మళ్లీ సర్వే చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డికి రైతులు వినతి పత్రాన్ని అందజేశారు.