ETV Bharat / state

ఇందూరు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు - Loksabha Elections 2019

నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్​కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 185 మంది అభ్యర్థులు పోటీ చేయడం, కొత్తరకం ఎం3 ఈవీఎంలను రికార్డు స్థాయిలో వినియోగించడం వల్ల ఈ ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు 36 కౌంటింగ్ టేబుళ్లతో మరో రికార్డు ఇందూరు ఖాతాలో చేరింది. అనేక పరిణామాల మధ్య జరిగిన నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలో గెలుపోటములపై తీవ్రమైన చర్చ సాగుతోంది. కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నిజామాబాద్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : May 22, 2019, 7:14 PM IST

దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఫలితం వెల్లడికి సమయం ఆసన్నమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేసింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉండగా... ఇందూరు జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ఐదు నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుంది. జగిత్యాలలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల కౌంటింగ్ చేపడుతారు.

అత్యధికంగా 36 టేబుళ్లు

నిజామాబాద్ లోక్​సభ కౌంటింగ్ కోసం అత్యధికంగా 36 టేబుళ్లకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఒక్కో అసెంబ్లీకి రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీలకు మొత్తం 14 హాళ్లలో లెక్కింపు జరగనుంది. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, కోరుట్ల, జగిత్యాలలో 8 రౌండ్లు, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలు 7 రౌండ్లు, ఆర్మూర్ నియోజకవర్గం 6 రౌండ్లలో లెక్కించనున్నారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తైన తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున వీవీప్యాట్​లను లెక్కిస్తారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఐదు రౌండ్ల సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ కోసం దాదాపు వెయ్యి మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.

పటిష్ఠ బందోబస్తు

కౌంటింగ్ కోసం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీలు 11, సీఐలు 24, ఎస్సైలు 74, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు 103, కానిస్టేబుళ్లు 438, మహిళా సిబ్బంది 63, హోంగార్డులు 149, రెండు సీఆర్పీఎఫ్ బెటాలియన్లు 80 మంది పోలీసులు బందోబస్తులో పాల్గోనున్నారు. మొత్తం ఐదు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. లెక్కింపు చేపట్టే సీఎంసీ భవనం ఆవరణలో ప్రత్యేక అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేశారు.

పెరుగుతున్న ఉత్కంఠ

సమయం దగ్గర పడటం వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. తెరాస నుంచి సీఎం కేసీఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, భాజపా నుంచి డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌ పోటీలో ఉన్నారు. తెరాస, భాజపా మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారోనని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పలుచోట్ల గెలుపుపై బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూడండి: ఇందూరులో మాత్రం 2 హాళ్లు, 36 టేబుళ్లు: రజత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.