ETV Bharat / state

తెలియకుండానే ఇళ్లు రిజిస్ట్రేషన్​.. కోర్టుకు వెళ్లమంటున్న అధికారులు

author img

By

Published : Aug 10, 2021, 5:51 PM IST

ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారు. ఎంతో కష్టపడి ఇళ్లు కట్టుకున్నారు. ఇంటి, నీటి పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కూడా వారికి పట్టాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఇళ్లు వారి పేరు మీద లేవు.. కొంత మంది అక్రమార్కులు వారి పేరు మీదికి మార్చుకున్నారు. ఏం చేయాలో తెలియని వారు అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. నిజామాబాద్ నగర శివారులోని దాస్​నగర్ గ్రామంలోని ప్రజల ఇళ్లను ఇతరులు పట్టా చేసుకున్న తీరుపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

dasnagar
దాస్​నగర్
తెలియకుండానే ఇళ్లు రిజిస్ట్రేషన్​.. కోర్టుకు వెళ్లమంటున్న అధికారులు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్‌నగర్‌లోని 506, 507, 521/1, 522, 523, 524, 525 సర్వే నెంబర్లలోని భూములన్నీ ఆబాది‍ (గ్రామకంఠం)గా రికార్డులో ఉన్నాయి. సర్వే నెంబరు 506లో 45.09 గుంటల భూమిలో నివాస స్థలాలున్నాయి. 1930లో నిజాంసాగర్ కాల్వల నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇక్కడ పని చేసిన వడ్డెరల కోసం 506లో నివాస స్థలాలు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. అప్పుడే దాస్ నగర్ గ్రామం కూడా ఏర్పడింది. 1991లో లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చింది. ఈ గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివాసముంటాయి. నిజామాబాద్‌-ఆర్మూర్‌ 63వ జాతీయ రహదారి పక్కనే దాస్‌నగర్‌ గ్రామం ఉంటుంది. అయితే 2015లో ఈ సర్వే నెంబర్లలోనే ఈ ఇళ్లను ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమిని పలువురు రియల్టర్లు కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. పక్కనే ఉన్న చెరువు శిఖం 4 ఎకరాలు, గ్రామస్థులు నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలు రిజిష్ట్రేషన్ చేసుకోవడంతో ఈ సర్వే నంబర్లలోనే ఉన్న ఇళ్లు తమ పేరుతో లేకుండా పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు మూడు వందల ఎకరాల్లో కొత్తగా వెంచర్

ప్రస్తుతం దాస్ నగర్ ఆనుకుని రెండు మూడు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. బాధితులు నష్టపోతున్న పన్నెండు ఇళ్లను ఆనుకుని ఉన్న భూమిలో దాదాపు రెండు మూడు వందల ఎకరాల్లో కొత్తగా వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. బాధితులు చెబుతున్న సర్వే నెంబర్లలోని భూమిని ఇద్దరి పేరుతో రిజిష్ట్రేషన్ చేసుకోగా... దాన్ని వెంచర్ సిద్ధం చేస్తున్న మరో రియల్టర్‌కు అమ్మినట్లుగా బాధితులు చెబుతున్నారు. ఆరేళ్ల కింద తమ ఇళ్ల స్థలాలను అక్రమంగా పట్టా చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో ఇక్కడే నివసిస్తున్నామని.. ఇంటి పన్ను, నల్లా పన్నులు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. తమ పేరుతో ఉన్న ఇళ్లను ఇతరులు ఎలా పట్టా చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదు

తహసీల్దార్‌, అదనపు కలెక్టర్, కలెక్టర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నా... ఎటువంటి ఫలితం లేదని వాపోతున్నారు. ఇతరుల పేరుతో పట్టా మార్పిడి అయినందున కోర్టుకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారని బాధితులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం రోడ్డును ఆనుకుని ఉన్న తమ ఇళ్లు పడగొడితే మంచి ధర వస్తుందన్న దురద్దేశంతోనే ఇలా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: Murder: తప్పని చెప్పినందుకు... తల్లిని బండరాయితో కొట్టి చంపిన తనయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.