ETV Bharat / state

జేఈఈ, నీట్​ పరీక్షలు వాయిదా వేయాలని కాంగ్రెస్​ వినతి - నిజామాబాద్​ కాంగ్రెస్​ వార్తలు

జేఈఈ, నీట్​ పరీక్షలను వాయిదావేయాలని కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేసింది. నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​లో ఆ పార్టీ నాయకులు వినతిపత్రం అందించారు.

జేఈఈ, నీట్​ పరీక్షలు వాయిదా వేయాలని కాంగ్రెస్​ వినతి

author img

By

Published : Aug 28, 2020, 4:23 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నందున జేఈఈ, నీట్​ పరీక్షలు వాయిదా వేయాలని నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ నాయకులు విజ్ఞప్తి చేశారు. జిల్లా కాంగ్రెస్​ ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో ఏవోకు వినతి పత్రం అందించారు.

కరోనా విలయతాండవం చేస్తుంటే... ప్రభుత్వం పరీక్షలు పెట్టి విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణ విషయమై ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అర్బన్ ఇంచార్జ్​ తాహెర్ బిన్ హందాన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.