యువ ఔత్సాహికులను ప్రోత్సహించడానికి విరివిగా రుణాలను అందించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రుణాల మంజూరులో ఎస్సీ, ఎస్టీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పథకం నిబంధనల ప్రకారం సర్వీస్ సెంటర్లో 25 లక్షల వరకు రుణాలు అందించడానికి అవకాశం ఉందన్నారు.
శ్రద్ధ తీసుకోవాలి..
గ్రామాల్లో 35, పట్టణ స్థాయిలో 25 శాతం సబ్సిడీ అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా రుణాల మంజూరు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లు శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు బ్యాంకర్లకు పంపించాలని సూచించారు.
ఇప్పటివరకు 308 దరఖాస్తులు రాగా బ్యాంకర్లు 28 మందికి రుణాలు మంజూరు చేశారని వెల్లడించారు. మిగిలినవి సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు, బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి బాబురావు, ఎల్డీఎం జయ సంతోషి, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: కేటీఆర్