తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా డిమాండ్ చేసింది. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని కోరుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర విజయవంతం అయిందని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య అన్నారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండించారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారని.. ఒవైసీ సోదరులతో కలిసి నిజాం నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 15న బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన, 17న బూత్ల వారీగా జాతీయ జెండా ఎగరేస్తామని ప్రకటించారు. జిల్లా ప్రజలందరూ సెప్టెంబరు 17న జాతీయ జెండా ఎగరేయాలని సూచించారు.
ఇదీ చూడండి: కొత్త రెవెన్యూ చట్టంతో పేదలు, రైతులకు మేలు: పువ్వాడ