స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నిజామాబాద్ కలెక్టరేట్ ముస్తాబైంది. కరోనా నేపథ్యంలో ఆంక్షల మధ్యే వేడుకలు నిర్వహించనున్నారు. రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. వైద్యారోగ్య శాఖ సూచనల ప్రకారం భౌతిక దూరం, శానిటైజేషన్, మాస్కులు ధరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపనున్నారు.
ఈసారి 50 మందితోనే వేడుకలను జరుపుతున్నారు. వేడుకను సైతం 20 నిమిషాల్లో ముగించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని అధికారులు పేర్కొన్నారు.