ETV Bharat / state

ఆరోగ్య శ్రీ పథకం కింద ఎక్కువ వైద్యం చేయండి: కలెక్టర్​ - నిజామాబాద్ జిల్లా బోధన్​ ఆస్పత్రి

బోధన్​లోని జిల్లా ఆస్పత్రిని కలెక్టర్​ నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ పథకాలను ఎంత ఎక్కువగా నిర్వహిస్తే అంతగా సర్కారు నుంచి నిధులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఆరోగ్య శ్రీ పథకం కింద ఎక్కువ వైద్యం చేయండి: నిజామాబాద్​ కలెక్టర్​

author img

By

Published : Feb 7, 2020, 5:59 PM IST

ఆరోగ్య శ్రీ పథకం కింద ఎక్కువ వైద్యం చేయండి: నిజామాబాద్​ కలెక్టర్​

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సూపరిండెంట్ అన్నపూర్ణ.. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు, వాటిలో కావాల్సిన మరమ్మతు​లను కలెక్టర్​కు చూపించారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ పథకాలను ఎంత ఎక్కువగా నిర్వహిస్తే అంతగా ప్రభుత్వం నుంచి నిధులు సమకూరుతాయని కలెక్టర్​ నారాయణ రెడ్డి తెలిపారు. బోధన్ ఆసుపత్రిని జిల్లా ఆస్పత్రిగా ప్రభుత్వం గుర్తించిందని దానికి తగ్గట్టుగా స్థలం సేకరించి కొత్త భవన నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: వనం నుంచి జనం మధ్యకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.