నిజామాబాద్ జిల్లాలోని ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి పోషణ అభియాన్ కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 15 రోజుల్లో మంచినీటి నల్లా కనెక్షన్, మరుగు దొడ్లు విధిగా నిర్మించేలా చూడాలని సూచించారు.
అంగన్వాడీ భవనాలు లేనిచోట పిల్లలకు అనువైన స్థలాల్లో కొత్తవి నిర్మించాలని జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు సూచించారు. పోషణ అభియాన్ ద్వారా గర్భిణీ, బాలింతలు, పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని కోరారు.