నిజామాబాద్‌కు చెందిన గిర్వాణీ శివసాయి పదేళ్ల వయసులో 52 కిలోల బరువుండేది. బరువు తగ్గడం కోసం బాక్సింగ్ మొదలుపెట్టి అతి తక్కువ కాలంలోనే క్రీడాకారిణిగా ఎదిగింది. మూడు నెలల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం, ఏడాదిలోనే జాతీయ టోర్నీలకు అర్హత సాధించి సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్జీఎఫ్ పోటీల్లో స్వర్ణాన్ని సాధించింది. పదిసార్లు జాతీయ పోటీల్లో పాల్గొని ఆరుసార్లు పతకాలు దక్కించుకుంది.
ఎన్నో పతకాలు...
ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసిన గిర్వాణీ ఆటలతో పాటు చదువులోనూ సత్తా చాటుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ సూచనలతో బాక్సింగ్ క్రీడలో రాణిస్తోంది. 2017 జనవరిలో సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ఆర్జీకేఏ టోర్నీలో బంగారు పతకం సాధించింది. అదే ఏడాది చివర్లో పెద్దపల్లిలో జరిగిన ఎస్జీఎఫ్ టోర్నీలో బంగారు పతకం పట్టేసింది. 2018లో మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన టోర్నీలో కాంస్యం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ అవకాశం లభించినా.. పాస్‌పోర్టు సమస్య వల్ల వెళ్లలేకపోయింది.
అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించి పతకం తీసుకురావాలనే లక్ష్యంతో గిర్వాణీ కసరత్తు చేస్తోంది. ఆమె కల నేరవేరాలని.. దేశం తరఫున మరో బాక్సర్ సత్తా చాటాలని కోరుకుందాం.
ఇవీ చూడండి: జ్వలించిన తపన.. నిత్యసాధనే నిచ్చెన