హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతి.. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్లో హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. యువజన, క్రీడల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి చూపాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కృష్ణ కుమార్ తెలిపారు.
- ఇదీ చూడండి : ప్రభాకరరావు పచ్చి అబద్దాల కోరు: ఎంపీ రేవంత్ రెడ్డి