నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో సీఏఏకు అనుకూలంగా భాజపా నాయకులు ప్రజా ప్రదర్శన సభను నిర్వహించారు. బిల్లుపై అనవసరంగా ముస్లింలను రెచ్చగొట్టి మత రాజకీయాలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ ఆరోపించారు. పాక్, బంగ్లాలో అల్ప సంఖ్యాక హిందువులను మతం పేరుతో అనేక హింసకు గురి చేస్తున్నారన్నారు. వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాంటి వారికే పౌరసత్వం ఇవ్వాలని చట్టం తీసుకొస్తే తప్పేలా అవుతుందని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ కేవలం రాజకీయ ప్రయోజనం కోసం చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. చట్టంపై కేటీఆర్ చెబుతున్న కారణాలు తప్పని నిరూపిస్తానని.. లేదంటే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని సవాల్ విసిరారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీ వివేక్, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు