ETV Bharat / state

హత్యకేసు విచారణలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు: ఎంపీ అర్వింద్​ - nizanmabad district news

నిజామాబాద్‌ జిల్లా న్యావనంది గ్రామస్థులు నగరంలోని ధర్నాచౌక్​ నుంచి సీపీ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంపీ అర్వింద్​ పాల్గొన్నారు. న్యావనందికి చెందిన మమత హత్యకేసులో నిందితులను పట్టుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. నిందితులను గుర్తించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

murder case rally in nizamabad
హత్యకేసు విచారణలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు: ఎంపీ అర్వింద్​
author img

By

Published : Nov 13, 2020, 4:18 PM IST

హత్యకేసు విచారణలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు: ఎంపీ అర్వింద్​

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామస్థులు పోలీస్ కమిషనర్ కార్తికేయను కలిశారు. ఎంపీ అర్వింద్​తో కలిసి వచ్చిన గ్రామస్థులు మహిళ హత్య కేసులో నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్ నుంచి సీపీ కార్యాలయం వరకు గ్రామస్థులు ర్యాలీగా వచ్చారు. ర్యాలీలో ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ నేత భూపతిరెడ్డి, భాజపా నేతలు పాల్గొన్నారు. 40రోజుల కింద న్యావనందిలో మమత అనే మహిళ హత్యకు గురైంది. నిందితులను గుర్తించడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారంటూ గ్రామస్థులు ఈ ర్యాలీ నిర్వహించారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ అర్వింద్ సీపీని కలిశారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీ కార్తికేయ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి కార్యాలయంలో బైఠాయించిన గ్రామస్థులకు విచారణ వివరాలు తెలియజేశారు. హత్య జరిగిన రెండు మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుంటామని చెప్పిన పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.