ETV Bharat / state

ఆ రోజు సీఎం కేసీఆర్ రాష్ట్రం వదిలి పారిపోతారు: ఎంపీ అర్వింద్

ఈ నెల 12న ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోతారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా సర్కారు ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోతారు: ఎంపీ అర్వింద్

author img

By

Published : Nov 10, 2022, 7:45 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమంతా ఓ బూటకమని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మునుగోడులో విజయం భాజపాదేనని వ్యాఖ్యానించారు. 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో తెరాస మద్యం, డబ్బు వెదజల్లిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా సర్కారు ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన అర్వింద్‌.. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈ నెల 12న ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తుండటంతో సీఎం కేసీఆర్ మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోతారని అర్వింద్‌ ఎద్దేవా చేశారు. సర్వే రిపోర్టు ప్రకారమే అధిష్ఠానం వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తుందని.. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళతామని వెల్లడించారు. ఈ క్రమంలోనే దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఉన్న వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.

ఇవీ చూడండి..

కేసీఆర్ హుందాగా వ్యవహరించి 'రామగుండం' ప్రారంభోత్సవంలో పాల్గొనాలి: కిషన్‌రెడ్డి

దేవుడి దర్శనం కోసం 2 కిలోమీటర్లు నడిచిన రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.