కొవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.50వేలు ఇస్తోందన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. మృతుల సంఖ్యపై రాష్ట్రం వద్ద లెక్కలు లేకపోవడం దౌర్భాగ్యమని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు కేంద్రం రుణ సబ్సిడీ ఇస్తున్నా.. రాష్ట్రం తన వాటాను ఇవ్వడం లేదని ఆరోపించారు. పథకాల గురించి అబద్ధాలు చెప్పే బదులు జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి రాజీనామా చేస్తే మంచిదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అటకెక్కిందని ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందని.. సరైన ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణమని మండిపడ్డారు.
రైతుల ఉసురు తీస్తున్నారు..
మరోవైపు తరుగు పేరుతో రైతుల ఉసురు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుగు తీస్తుంటే తెరాస ఎమ్మెల్యేలు ఎందుకు రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రీసైక్లింగ్ బియ్యం దందాలో భాగం అయినందునే వెళ్లడం లేదని విమర్శించారు. ఈ ఏడాది తూకంలోనూ రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికీ 60శాతం మాత్రమే ధాన్యం సేకరణ పూర్తయ్యిందని అన్నారు. బాయిల్డ్ రైస్ సాగు చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల్లో క్వింటాకు రూ.300 ఇన్సెంటివ్ ఇస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
దళితబంధు ఏమైంది?
దళితులందరీకి ఇస్తామన్న దళితబంధు ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించారు. 2014 తెరాస మేనిఫెస్టోలో ఎంఐఎస్ కింద పసుపు పంటకు ధర కల్పిస్తామని చెప్పిందని.. హామీ ప్రకారం ఎంఐఎస్ కింద పసుపు పెట్టాలని డిమాండ్ చేశారు. వరి రైతులు ఇంకా అయోమయంలో ఉన్నారని అర్వింద్ అన్నారు. గత ఏడాది కేంద్రం తీసుకున్న చర్యలతో పసుపు పంటకు మంచి ధర వచ్చిందని ఎంపీ పేర్కొన్నారు. చెరుకు పరిశ్రమలు తెరవడానికి కేసీఆర్కు ఉన్న ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. చెరుకు ద్వారా ఇథనాల్ తయారు చేస్తే రైతులకు మంచి ధర లభించనుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా అంటూ ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు.
లెక్కలు లేకపోవడం దౌర్భాగ్యం
కొవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.50వేలు ఇస్తోంది. మృతుల సంఖ్యపై రాష్ట్రం వద్ద లెక్కలు లేకపోవడం దౌర్భాగ్యం. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అటకెక్కింది. అక్రమ తరుగుపై రైసు మిల్లర్లను ఎందుకు అడగట్లేదు. తెరాస ఎమ్మెల్యేలు బియ్యం రీసైక్లింగ్ దందాలో ఉన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో వరిపై క్వింటాకు రూ.300 బోనస్ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదు. దళితబంధు ఏమైంది కేసీఆర్?. చెరుకు పరిశ్రమలు తెరిచేందుకు ఇబ్బంది ఏంటి?. -ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
ఇదీ చదవండి: