రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అర్వింద్... సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తొలిసారిగా వెల్మల్ గ్రామాన్ని సందర్శించారు.
గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మౌలిక వసతులు, విద్య, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై గ్రామస్థులతో చర్చించారు. గ్రామానికి కావల్సిన నిధులు, అవసరాలపై అధికారులతో సమీక్షించారు. వెల్మల్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని ఎంపీ తెలిపారు.