BRS Public Meeting At Bodhan : వచ్చే శాసనసభ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో సీనియారిటీకి, సిన్సియారిటీకి మధ్యే పోటీనని ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) స్పష్టం చేశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ కావాలో.. లేకపోతే 3 గంటల కరెంట్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో కవితతో పాటు ఎమ్మెల్యే షకీల్, ఇతర ముఖ్యనేతలు కూడా పాల్గొన్నారు.
"తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఎగిరెగిరి పడుతున్నారు. ప్రజలను అయోమయానికి గురిచేయడానికే వారు ఉన్నారు. పని చేసిన వారిని గుర్తించాలి. రాష్ట్రంలో ప్రతి కులానికి అధికారిక భవనం కట్టించాము. అన్ని మతాలను సమానంగా చూస్తున్నాము. ఎమ్మెల్యే షకీల్.. బోధన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఓటు వేసి గెలిపించాలని" ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు.
Kavitha Fires On Congress In BRS Public Meeting : రాష్ట్రంలో గులాబీ విప్లవం వచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లుంది.. రాహుల్ గాంధీ భారత్ జోడో(Rahul Gandhi Bharat Jodo) అని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పాలనను దేశమంతా అందిస్తామని మరోసారి కవిత హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.
"బోధన్ నియోజకవర్గమంటే అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాల వారు ఉన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ చాలా మంది నివాసం ఉంటున్నారు. అందరినీ కలుపుకొని.. ముందుకు పోతున్న సందర్భం ఉంది. రాష్ట్రం నూతనంగా ఆవిర్భవించిన తర్వాత ఒక్క బోధన్‌లోనే 10వేలు మంది బీడీ కార్మికులకు ఫించన్ ఇస్తున్నాము. మళ్లీ ఎన్నికల్లో షకీల్ బాయ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలి." - కవిత, ఎమ్మెల్సీ
MLC Kavitha Comments On Congress Party : రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి కులానికి సంబంధించిన పండగలను నిర్వహిస్తుందని కవిత తెలిపారు. ప్రతి కులం, మతంలో పేద వారు ఉంటారని.. వారందరికీ బట్టలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క చెరువును కూడా బాగు చేయలేదని.. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోధన్ నియోజకవర్గంలోనే 152 చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. బోధన్‌లోని 4500 డ్వాక్రా సంఘాలకు పదేళ్లలో రూ.2,600 కోట్లు రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు. బోధన్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు గడపగడపకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. 10 రోజుల క్రితమే నిజామాబాద్‌లో టీహబ్ ఏర్పాటు చేసి.. ప్రారంభం రోజునే 250 మందికి ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్సీ కవిత వివరించారు.
Bandi Sanjay and MLC Kavitha Tweet War : బండి సంజయ్ VS ఎమ్మెల్సీ కవిత.. ట్విటర్‌లో మాటల యుద్ధం
MLC Kavitha: 'కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే నాపై ఆరోపణలు'